అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్న పవన్ ఎపిసోడ్.!

అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్న పవన్ ఎపిసోడ్.!

Published on Feb 3, 2023 7:07 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదటిసారిగా ఓటిటి లో అందులోని ఓ టాక్ షో లో కనిపించడం అనేది సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. పైగా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే షో అన్ స్టాప్పబుల్ లాంటి దానికి తాను హాజరు కానున్నారు అనేది క్రేజీ గా మారగా ఈ అవైటెడ్ ఎపిసోడ్ లో మొదటి పార్ట్ నిన్న రాత్రి నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది.

అయితే ముందే భారీ రెస్పాన్స్ ఊహించిన ఆహా టీం అప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరి అయినా యాప్ లో భారీ ట్రాఫిక్ తో కొంతమందికి సాంకేతిక ఇబ్బందులు ఎదురు కాగా అక్కడ నుంచి పలు రికార్డులు ఈ ఎపిసోడ్ బ్రేక్ చేసినట్లు తెలిపారు. హైయెస్ట్ యాప్ లాంచ్ లు అలాగే అత్యధిక స్ట్రీమింగ్ మినిట్స్ మొదటి 90 నిమిషాల్లో ఇలా పలు ఆల్ రికార్డ్స్ పవన్ ఫ్యాన్స్ సెట్ చేసినట్టుగా ఆహా వారు తెలిపారు. మొత్తానికి అయితే అనుకున్న అంచనాలు ఈ ఎపిసోడ్ అందుకుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు