‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ అవ్వన్నీ ఒట్టి గాలివార్తలే అని తేలిపోయాయి. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలుసుకున్నారు. పక్కపక్కనే కూర్చొని ఒకరికి ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇకనైనా గాసిప్స్ రాసే వాళ్ళు ఇలాంటి వార్తలు రాయొద్దని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అత్యంత సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా అయింది.


