సప్తగిరి ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ !

31st, October 2016 - 01:51:26 PM

pawan-kalyan-saptagiri
టాలీవుడ్ పరిశ్రమలోని హీరోలు చాలా మంది ఈ మధ్య తన సినిమా ఆడియో ఫంక్షన్లకు తమ అభిమాన హీరోలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఆనవాయితీ అయిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు పరిశ్రమలోని హీరోల్లో చాలామంది అభినయానులవడం వలన చాలా వరకూ అందరూ ఆయన్నే ముఖ్య అతిధిగా పిలుస్తుంటారు. పవన్ కూడా నితిన్, మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షలకు వెళుతుంటారు. అలాంటి ఆయన హీరోగా తొలి ప్రయత్నంగా కమెడియన్ సప్తగిరి చేస్తున్న ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రం యొక్క ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లనున్నారు.

ఇది కాస్త ఆశ్చర్యమే అయినా నిజం. నవంబర్ 6 న ఈ వేడుక జరగనుంది. ‘పరుగు’ సినిమాతో తెలుగు తెరపై కనిపించిన సప్తగిరి ‘ప్రేమ కథా చిత్రం’ తో స్టార్ కమెడియన్ అయ్యాడు. ఆ తరువాత అనేక సినిమాల్లో ఆయన కోసమే ప్రత్యేక పాత్రలు రాసేవారు రచయితలు, దర్శకులు. అలాంటి సప్తగిరి అలీ, బ్రహ్మానందం, సునీల్, శ్రీనివాస్ రెడ్డి ల బాటలోనే హీరో అవ్వాలనే ప్రయత్నంలో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ల ద్వారా సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. సుమారు రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డా. రవి కిరానే నిర్మిస్తుండగా అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తున్నాడు.