యూరప్ టూర్లో పవన్ కళ్యాణ్ చేయబోయేది ఇవే !
Published on Jul 6, 2017 1:36 pm IST


పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ షూటింగ్ పూర్తవగానే చిత్ర టీమ్ మొత్తం జూలై 19న యూరప్ వెళ్లనున్నారు. సుమారు 20 రోజుల పటు జరగనున్న ఈ షెడ్యూల్లో ముఖ్యమైన షూటింగ్ పార్ట్ ను పూర్తిచేయనున్నారు.

ముందుగా ఒక ఛేజ్ సీక్వెన్సును షూట్ చేసి ఆ తర్వాత రెండు పాటలను, ఇంకొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. బల్గెరియా వంటి లొకేషన్లలో ఈ చిత్రీకరణ జరగనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా సినిమా ఫస్ట్ లుక్, విడుదల తేదీలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook