పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా, చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న సినిమా ‘గబ్బర్ సింగ్ 2’. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. ఈ చిత్ర టీంకి చాలా దగ్గరి వారు చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూణేలోని ఓ పల్లెటూరిలో మొదలు కానుంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే బయలుదేరి పూణే వెళ్లనున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర డైరెక్టర్ బాబీ, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కలిసి ఈ సినిమా కోసం మహారాష్ట్రలో లొకేషన్స్ ని వెతుకుతున్నారు.
అలాగే మే 29న పూనేలో మొదలు కానున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ జూన్ 5తో ముగియనుంది. ఆ తర్వాత మిగిలిన లాంగ్ షెడ్యూల్స్ ని ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఫుల్ గడ్డం లుక్ తో ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే లుక్ మార్చి గబ్బర్ సింగ్ 2 సెట్లో అడుగుపెట్టనున్నాడు.


