‘బాహుబలి-2’ ఇంటర్వెల్ సన్నివేశానికి పవన్ కళ్యాణే ఇన్స్పిరేషనట !

30th, April 2017 - 10:12:22 AM


రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం ‘బాహుబలి – ది కంక్లూజన్’ ను చూసి యావత్ దేశం మొత్తం పులకించిపోతోంది. సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. థియేటర్లోకి వెళ్లిన ప్రతి ఒక్కరు ఒక్కొక సీన్ అద్భుతమని రాజమౌళిని, రచయిత విజయేంద్ర ప్రసాద్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ముఖ్యంగా సినిమాకు అత్యంత కీలకంగా నిలిచిన ఇంటర్వెల్ సన్నివేశానికైతే ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఇంత గొప్ప సీన్ ను రాయడానికి విజయేంద్ర ప్రసాద్ కు స్ఫూర్తినిచ్చింది ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ కలిగింది.

ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆ సన్నివేశం రాయడానికి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అన్నారు విజయేంద్రప్రసాద్. ముందుగా విశ్రాంతి ఘట్టంలో తన పట్టాభిషేకం సమయంలో జనం బాహుబలిని కీర్తిస్తుంటే భల్లాలదేవుడు అసూయతో రగిలిపోవాలి అనే కాన్సెప్ట్ పెట్టాలనుకున్నాం. దాని గురించి ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు టీవీ చూస్తున్నప్పుడు ఏదో ఆడియో వేడుక జరుగుతోంది, అక్కడ పవన్ లేకపోయినా జనాలంతా ఆయన పేరు చెప్పినప్పుడల్లా ఊగిపోతున్నారు, ఆ సమయంలో వేదికపై ఎవరున్నా అసూయపడాల్సిందే. ఆ సీన్ చూసి ఇంటర్వెల్ బ్లాక్ రాశాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా నిలిచారు అన్నారు.