ఫోటో మూమెంట్ : రేర్ పిక్ తో అన్నయ్య చిరుకి పవన్ స్పెషల్ విషెష్!

ఫోటో మూమెంట్ : రేర్ పిక్ తో అన్నయ్య చిరుకి పవన్ స్పెషల్ విషెష్!

Published on Aug 22, 2023 1:00 PM IST

టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈరోజు కావున సూపర్ స్పెషల్ డే అయితే మెగా ఫ్యాన్స్ కి ఎంతో ఆనందంగా మారింది. ఇక వారితో పాటుగా మెగాస్టార్ కుటుంబం నుంచి కూడా ఒకొక్కరు కూడా తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుండగా ఈ విషెష్ లో అయితే మెగాస్టార్ సోదరుడు మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే నిన్న ట్విట్టర్ వేదికగా తన పార్టీ హ్యాండిల్ నుంచి బర్త్ డే విషెష్ ని తెలుపగా ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అయితే మరింత స్పెషల్ పోస్ట్ ని తాను వేశారు. మరి తనది తన చిన్ననాటి సమయంలో చిరు పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ అరుదైన ఫొటోగ్రాఫ్ ని పవన్ పంచుకొని “అడుగడుగునా స్ఫూర్తిచిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఇన్స్టాలో చిరు ని ట్యాగ్ చేసి మరీ తెలిపారు. దీనితో ఈ బ్యూటిఫుల్ పిక్ ఫ్యాన్స్ లో మరింత ఆనందాన్ని నింపి వారి ఉత్సహాన్ని రెట్టింపు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు