‘పవన్ కళ్యాణ్’ సరసన వరుణ్ తేజ్ హీరోయిన్ !

Published on Jan 25, 2020 9:32 am IST

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న కొత్త చిత్రం ఈ నెల 27 నుండి హైదరాబాద్‌ లో ఎలాంటి హంగమా లేకుండా షూటింగ్ ప్రారంభించబోతున్న విషయం మేము ముందుగానే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్‌ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌ ఇప్పటికే వరుణ్ తేజ్ సరసన కంచె సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం చారిత్రక కాలం నాటి ఓ ఎమోషనల్ విప్లవాత్మకమైన చిత్రం అట. పైగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తోన్న మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రం కావడం విశేషం. ఇక ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. అన్నట్టు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర మంచి కోసం పోరాడే ఒక దొంగ పాత్ర అని తెలుస్తోంది.

మొత్తానికి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ‘పింక్’ రీమేక్ షూటింగ్ మొన్న మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More