పవన్ కళ్యాణ్‌కు కోపం వచ్చింది

Published on Jan 24, 2020 3:35 pm IST

దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్లో నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ మొడలైంది. ఇలా పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా.. సినిమా చిత్రీకరణలో పవన్ పాల్గొంటున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఔత్సాహికులు కొందరు ఎకంగా షూటింగ్ వీడియో తీసి ఆన్ లైన్లో షేర్ చేశారు.

ఈ వీడియోలు కొద్దిసేపట్లోనే వైరల్ అయిపోయాయి. వాటిలో షూట్ చేసిన సన్నివేశం ఏమిటనేది కూడా రివీల్ అయింది. దీంతో పవన్ యూనిట్ సభ్యుల మీద కొద్దిగా సీరియస్ అయ్యారని, ఇకపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకూడదని గట్టిగా సూచించారని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ యేడాది మొదటి అర్థ భాగంలోనే ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More