‘బాలయ్య – పవన్’ ఎపిసోడ్ షూట్ అప్పుడే !

‘బాలయ్య – పవన్’ ఎపిసోడ్ షూట్ అప్పుడే !

Published on Dec 19, 2022 11:00 AM IST

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ తాలూకు ప్రోమో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ తర్వాత రాబోయే ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడే. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ గెస్ట్ లుగా రాబోతున్నారని వార్తలు వచ్చాయి. ఐతే, తాజాగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు షూట్ చేయబోతున్నారో కూడా క్లారిటీ వచ్చింది. ఈ నెల 27న ఈ ఎపిసోడ్ ను షూట్ చేయబోతున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లతో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఈ ఎపిసోడ్ లో కాసేపు గెస్ట్ గా అలరించనున్నాడు. మరి బాలయ్య షోకి పవన్ గెస్ట్ గా వస్తే.. ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి అన్నదే ఇప్పుడు ప్రధాన ఆసక్తి. ఏది ఏమైనా పవన్ – బాలయ్య ఒకే వేదిక పై, పైగా ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు డిస్కషన్ కి రావడం నిజంగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే. ఎలాగూ మధ్యలో త్రివిక్రమ్ కూడా ఉంటాడు. బాలయ్య త్రివిక్రమ్ పై పంచ్ లు వేయడం ఖాయం. ఏ రకంగా చూసుకున్నా బాలయ్య – పవన్ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు