ఫోన్ నెంబర్ పట్టుకుని ‘వకీల్ సాబ్’ మీద కేసు వేశాడు

Published on May 3, 2021 10:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఇటీవలే ఓటీటీల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్, కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించలేకపోయిన చాలామంది అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా సినిమా మీద పోలీస్ పిర్యాదు చేశారు ఒక వ్యక్తి. అది కూడ ఒక మొబైల్ నెంబర్ విషయంలో కావడం విశేషం. అవును తన మొబైల్ నెంబర్ తన అనుమతి లేకుండా సినిమాలో వాడారనేది అతని అభియోగం.

నటి అంజలి మీద నడిచే ఒక సన్నివేశంలో విలన్ గ్యాంగ్ ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడుతూ ఆ ఫోటోల కింద ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తనదేనని, తన అనుమతి లేకుండా సినిమాలో వాడారని, దాని వలన తనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని అతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. అంతేకాదు అతని తరపున లాయర్ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ ను నోటీసులు కూడ పంపారట. మరి దీని మీద నిర్మాత దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :