ప్రజారాజ్యంలా కాకుండా జాగ్రత్త పడుతున్న పవన్ !


జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిమూడేళ్లు గడచిన సందర్భంగా సినీనటుడు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ నేడు మీడియా ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా పవన్ పలు విషయాల గురించి ప్రస్తావించారు.తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ గుంరించి పవన్ ప్రస్తావించిన విషయం ఆసక్తి కరంగా మారింది.

ప్రజారాజ్యం పార్టీ సమయం లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు పవన్ తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ లో అనే ఆర్ధిక అవకతవకలు జరిగాయని పవన్ అన్నారు. పార్టీ నిధులు దుర్వినియోగం జరిగిందని.. జనసేన లో అలా జరగకుండా జాగ్రత్త పడుతానని పవన్ అన్నారు.

జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోవు ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న విషయాన్ని పవన్ చివరగా స్పష్టం చేశారు.