పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమాని అయితే ఆల్రెడీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఉంటుంది అని స్ట్రాంగ్ టాక్ ఉండగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అయితే ఇపుడు మరింత గ్రాండ్ గా మారుతున్నట్టుగా తెలుస్తుంది.
ఆల్రెడీ పవన్ నుంచి కావాల్సిన భారీ యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్లాన్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో విలన్ గా నటించనున్నాడు అనే టాక్ మరింత కేజ్రీగా మారింది. దీనితో అయితే ఆల్రెడీ సినిమాపై ఉన్న మాస్ అంచనాలు మరింత స్థాయిలో పెరిగాయని కూడా చెప్పొచ్చు. మరి ఆ హీరో ఎవరు అనే ఇతర డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.