పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ ఆరోజేనా..?
Published on Aug 5, 2017 3:25 pm IST


పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కలయిక లో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు విజయం సాధించాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ కూడా ఇంకా ప్రకటించలేదు.

దీనితో పవన్ అభిమానులు ఈ చిత్ర విశేషాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన అనేక రకాల టైటిల్స్ సోషల్ మీడియాలో ప్రచారం లో ఉన్నాయి. అవేవి అధికారికంగా ప్రకటించినవి కావు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఇండిపెండ్స్ డే సందర్భంగా ఆగష్టు 15 న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

 
Like us on Facebook