రామ్ చరణ్ సరసన పవన్ కళ్యాణ్ హీరోయిన్
Published on Dec 5, 2017 5:49 pm IST

రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ లో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మద్య రామ్ చరణ్- బోయపాటి శీను సినిమా పూజతో ఆరంభమయ్యింది. జనవరి రెండోవారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు, తమన్ సంగీతం అందించబోతున్నఈ ప్రాజెక్ట్ లో చరణ్ సరసన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ఖరారైనట్టు సమాచారం. అయితే ఈ వార్తపై నిర్మాతలు నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈమె పవన్ సినిమాతో పాటు సినిమాతో పాటు అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’, నాగ చైతన్య, మారుతి సినిమాలో కూడా నటిస్తోంది.

 
Like us on Facebook