డిసెంబర్ కల్లా పవన్ సినిమా పూర్తవుతుందట!
Published on Aug 1, 2016 9:47 pm IST

pawan-kal
ఎన్నో మార్పులు జరిగిన అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా ఇప్పుడు సాఫీగా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా, చివరినిమిషంలో ఆయన తప్పుకోవడంతో ఆ తర్వాత డాలీ దర్శకుడిగా ఎంపికయ్యారు. దీంతో సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికి ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ మొత్తం దాదాపుగా పూర్తైందని, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని తెలుస్తోంది.

అదేవిధంగా ఈ సినిమాను కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేయాలని టీమ్ భావిస్తోందట. డిసెంబర్ కల్లా సినిమాను పూర్తి చేసేసి, వీలైతే జనవరి నెలాఖర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయమై టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా ప్రచారం పొందుతోంది.

 
Like us on Facebook