తొలిసారి ట్రై చేస్తున్న పవన్ హీరోయిన్లు !
Published on Nov 29, 2017 5:10 pm IST

‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమా తరువాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్’ వంటి సినిమాల్లో నటించిన ఆమె తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ లో కూడా న‌టిస్తోంది. ఈ సినిమా కోసం అను ఇమ్మాన్యుయేల్ మొదటిసారి తన పాత్రకు తానే స్వయంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటోంది.

ఇందులో నటించిన మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇలా ఈ ఇద్దరు హీరోయిన్స్ మొదటిసారి డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. లాస్ట్ షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తెలుగులో సంగీతం అందించిన మొదటి సినిమా ఇదే అవ్వడంతో ఆడియో పై ప్రేక్షల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

 
Like us on Facebook