బోల్డ్ హీరోయిన్ బోల్డ్ సీన్స్ పూర్తి చేసిందట !

బోల్డ్ హీరోయిన్ బోల్డ్ సీన్స్ పూర్తి చేసిందట !

Published on Jul 8, 2019 3:43 PM IST

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్ రాజ్ వేశ్య పాత్రలో నటిస్తునప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో పోలీస్ గెటప్ లో కనిపించనుంది. అలాగే సినిమాలో పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ బాగా బోల్డ్ గా ఉంటుందట. ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్న పాయల్ కొన్ని బోల్డ్ సీన్స్ తో పాటు ఇంటర్వెల్ సీక్వెన్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు మరీ బోల్డ్ గా ఉంటాయట. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు