“పుష్ప” ఖాతాలో అసలైన పాన్ ఇండియన్ రికార్డ్ అట!

Published on Aug 19, 2021 8:32 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా “పుష్ప ది రైజ్”. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాల్లో ఇది మొదటిది. భారీ లెవెల్లో పాన్ ఇండియన్ స్థాయి సినిమాగా దీనిని మేకర్స్ తెరకెక్కిస్తుండగా అంచెలంచెలుగా ఈ చిత్రం అంచనాలు పెంచుకుంటూ వెళుతుంది. అయితే బన్నీ కి ఇది ప్రిస్టేజియస్ పాన్ ఇండియన్ ఎంట్రీ కావడంతో చాలా ఆసక్తి కూడా నెలకొంది.

మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా వాటిలోనే మొన్ననే ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. సాలిడ్ ప్రమోషన్స్ తో మంచి హైప్ నడుమన పాన్ ఇండియన్ వైడ్ ఏక కాలంలో ఈ సాంగ్ ని రిలీజ్ చెయ్యగా అది కాస్తా ఇప్పుడు ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ రికార్డ్ సెట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సాంగ్ విడుదలైన ప్రతి భాషలో కూడా లక్షకి పైగా లైక్స్ సాధించిన ఫస్ట్ పాన్ ఇండియన్ చిత్రం సాంగ్ గా ఇది రేర్ రికార్డు ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో పుష్ప ఖాతాలో అసలైన పాన్ ఇండియన్ లెవెల్ రికార్డ్ పడ్డట్టు అయ్యిందని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు. మరి ఈ క్రేజీ ఫస్ట్ సింగిల్ ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :