పెటా టీజర్ టాక్ – తలైవా ఈజ్ బ్యాక్ !

Published on Dec 12, 2018 11:36 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 165వ చిత్రం ‘పెటా’ టీజర్ తలైవా బర్త్ డే సందర్భంగా ఈ రోజు విడుదలచేశారు. ఇక టీజర్ తో రజినీ ,అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఈ టీజర్ లో ఒక లుక్ తో బాషా సినిమా ను గుర్తుచేయగా మరో లుక్ లో ట్రెడిషనల్ గెటప్ తో అదరగొట్టాడు. టీజర్ మొత్తం రజినీ స్టైల్ కు తగ్గట్లు కట్ చేశారు. ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు హైలైట్ అయ్యింది.

ఇక ఇటీవల వరుస పరాజయాలతో నిరాశపరిచిన రజినీ ‘2.0’ తో ట్రాక్ లో వచ్చిన అది టెక్నాలజీ ఖాతాలో వెళ్లడంతో ఆయన అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఇక తాజాగా ఈ చిత్రం అభిమానులను మెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. ‘జిగర్తాండ’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరిలో పొంగల్ కు విడుదలకానుంది. త్వరలోనే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్షకులముందుకు రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :