ఫోటో మూమెంట్..బన్నీ గుండెలపై కూతురు అర్హ.!

Published on Apr 21, 2021 2:00 pm IST

స్టైలిష్ స్టార్ అర్జున్ ఇప్పుడు ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇపుడు కాస్త గ్యాప్ దొరికిందో ఏమో కానీ కుటుంబంతో బన్నీ ఆనందంగా గడుపుతున్నట్టున్నాడు. మరి తాజాగా బన్నీ భార్య అల్లు స్నేహా ఒక బ్యూటిఫుల్ ఫోటోను బన్నీ మరియు అర్హ కలిసి ఉన్నది షేర్ చేసారు.

ఏ తండ్రికి అయినా తన పిల్లలని ముఖ్యంగా కూతురికి తండ్రికి మంచి అనుబంధం ఉంటుంది. చిన్ననాటి నుంచి గుండెల ఆడించి ప్రేమగా చూసుకుంటారు. మరి అలానే బన్నీ గుండెలపై అర్హ అందంగా ఆనందంగా గడుపుతూ ఉన్న క్షణాన్ని స్నేహా క్లిక్ మనిపించి షేర్ చేసారు. దీనితో ఈ ఫోటో చూసి బన్నీ అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన పుష్ప టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :