ఫోటో మూమెంట్ : ప్రభాస్ కత్తితో “సలార్” సృష్టికర్త

ఫోటో మూమెంట్ : ప్రభాస్ కత్తితో “సలార్” సృష్టికర్త

Published on Dec 19, 2023 2:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి ఇప్పుడు సిద్ధం కాబోతుండగా మేకర్స్ ఆఫ్ లైన్ లో మంచి ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఆఫ్ లైన్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మేకర్స్ సాలిడ్ ఎలిమెంట్స్ తో మంచి హై ని ఇస్తున్నారు.

అలా ఓ పిక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి ఈ చిత్రంలో మెయిన్ రోల్ ప్రభాస్ తన కత్తితో చూపిన వైలెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో నిన్న రెండో ట్రైలర్ లో కూడా చూపించారు. మరి ఈ సలార్ ని కానీ ఈ సినిమాలో తన పాత్ర చేసే వైలెన్స్ ని కానీ సృష్టించిన ఆ సృష్టికర్త ప్రశాంత్ నీల్ ఆ కత్తి పట్టుకొని తన మార్క్ డార్క్ మోడ్ లో కనిపించిన పిక్ ఇపుడు ఫ్యాన్స్ లో క్రేజీగా మారింది. ఇక ఈ చిత్రం అయితే ఈ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు