ఫోటో మూమెంట్..సెట్స్ లో స్టైలిష్ “ఒరిజినల్ గ్యాంగ్ స్టర్”.!

ఫోటో మూమెంట్..సెట్స్ లో స్టైలిష్ “ఒరిజినల్ గ్యాంగ్ స్టర్”.!

Published on Apr 18, 2023 1:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన ఫ్యాన్ డైరెక్టర్ యంగ్ బ్లడ్ సుజీత్ తెరకెక్కిస్తున్న క్రేజీ యాక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో పవన్ ని సుజీత్ “ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” గా ఓ రేంజ్ లో చూపించనుండగా మరి ఈరోజే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమా సెట్స్ లోకి వచ్చినట్టుగా మేకర్స్ ముందుగా ఓ కాన్సెప్ట్ పోస్టర్ తో అయితే అనౌన్స్ చేశారు.

ఇక నెక్స్ట్ అయితే షూట్ కి ముందు సెట్స్ లోకి వచ్చిన సూపర్ స్టైలిష్ పిక్ తో పవన్ పై మరో ఫోటోని షేర్ చేశారు. దీనితో ఈ పిక్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది. మరి గాగుల్స్ పెట్టుకొని పవన్ తన మార్క్ హూడితో స్టైలిష్ గా కనిపించడం ఫ్యాన్స్ కి ట్రీట్ గా మారింది. దీనితో ఈ సినిమా పట్ల పవన్ లుక్స్ విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు