ఫోటో మూమెంట్ : సూపర్ స్టార్‌తో.. బ్యాడ్మింటన్ స్టార్!

ఫోటో మూమెంట్ : సూపర్ స్టార్‌తో.. బ్యాడ్మింటన్ స్టార్!

Published on Apr 7, 2015 7:32 PM IST

mahesh-sina
సైనా నెహ్వాల్.. గత కొన్నేళ్ళుగా భారత్‌కు తిరుగులేని విజయాలను అందిస్తూ వస్తోన్న బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్. భారత్‌లో ఇప్పటివరకూ ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకుంది. ఈమధ్యే నెంబర్ వన్ స్థానానికి సైతం చేరుకొని షబాష్ అనిపించుకుంది. మహేష్ బాబు.. తన మార్క్ నటనతో కేవలం తెలుగు సినిమాలతోనే దేశం మొత్తం గుర్తించేంత స్థాయికి చేరుకున్న నటుడు. అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతలను కలవడం సంతోషంగా ఉందంటూ ఈ ఫోటోను సైనా తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసింది. ఒకరు సినిమాల్లో సూపర్ స్టార్, మరొకరు ఆటల్లో సూపర్ స్టార్. ఇలా ఇద్దరూ ఒకే ఫ్రేములో మెరిసిపోవడం బాగుంది కదూ..?!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు