ఫోటో మూమెంట్ : ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు “గజిని” లు

ఫోటో మూమెంట్ : ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు “గజిని” లు

Published on Nov 7, 2023 2:00 PM IST

మూవీ లవర్స్ లో “గజిని” సినిమాల కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో చేసిన మొదటి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ తరువాత హిందీలో హీరో ఆమీర్ ఖాన్ తో కూడా అదే పేరుతో చేయగా అక్కడా బాక్సాఫీస్ రికార్డులు ఈ చిత్రం తిరగరాసి బాలీవుడ్ లో ఫస్ట్ 100 కోట్ల చిత్రంగా నిలిచింది. మరి ఇంత స్పెషల్ చిత్రం అయినటువంటి ఈ సినిమా హీరోస్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది.

మరి దానిని అయితే హిందీ చిత్రానికి సినిమాటోగ్రఫీ వర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ రవి కె చంద్రన్ అయితే షేర్ చేశారు. యూనివర్సల్ హర్ కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరు గజినీ లు ఒకే ఫ్రేమ్ లో అంటూ ఓ బ్యూటిఫుల్ స్నాప్ ని అయితే తాను షేర్ చేయగా ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండ్ స్పెషల్ ఫోటో ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది. ఇక సూర్య ఇప్పుడు భారీ చిత్రం “కంగువ” లో బిజీగా ఉండగా అమీర్ సితారే జమీన్ పర్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు