బాలీవుడ్ లోకి విక్రమ్ -సూర్య కలిసి నటించిన సినిమా !

Published on Feb 21, 2019 10:35 am IST

కోలీవుడ్ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్ , సూర్య కలిసి నటించిన చిత్రం పితామగన్. 2003 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈచిత్రం జాతీయ అవార్డు తో పాటు పలు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. ఇక 2004 లో ఈసినిమా తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో విడుదలైయింది. బాలా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విక్రమ్ , సూర్య ల నటన హైలైట్ అయ్యాయి.

ఇక ఇన్ని సంవత్సరాల తరువాత ఈచిత్రం బాలీవుడ్ లో రీమేక్ కానుందని సమాచారం. అయితే ఒరిజినల్ వెర్షన్ లో విక్రమ్ , సూర్య నటించిన పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాలి. త్వరలోనే ఈ రీమేక్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇంతకుముందు ఈ చిత్రం కన్నడ లో కూడా రీమేక్ అయ్యింది.

సంబంధిత సమాచారం :