మోదీ బయోపిక్ విడుదల తేదీ మారింది !

Published on Mar 19, 2019 11:43 am IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘పిఎం నరేంద్ర మోదీ’. ‘సరబ్జిత్ , మేరీ కోమ్’ వంటి బయోపిక్ లను డైరెక్ట్ చేసిన ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా బోమన్ ఇరానీ ,దర్శన్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈచిత్రాన్ని మొదట ఏప్రిల్ 12న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు ఈ సినిమా వారం ముందుగానే విడుదలకానుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ ,ఆనంద్ పండిట్ ,ఆచార్య మనీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More