విడుదలైన మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్” సరికొత్త పోస్టర్..!

Published on Jul 19, 2021 7:38 pm IST

తన సినిమాల తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అగ్ర దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పోన్నియిన్ సెల్వన్. ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం వచ్చే ఏడాది విడుదల కి సిద్దం అని తెలుస్తోంది. అంతేకాక ఈ చిత్రాన్ని కల్కి యొక్క పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిరత్నం మరియు సుభాస్కరన్ అల్లిరజః నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లో కార్తీ, విక్రమ్, అనుష్క శెట్టి, అమితాబ్ బచ్చన్, త్రిష, నయనతార, ఐశ్వర్య రాయ్, జయం రవి, కీర్తీ సురేష్, శోభిత ధూళిపాళ, రాశి ఖన్నా, అదితి రావు హైదరి, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :