బన్నీ ‘డీజే’కు హీరోయిన్ దొరికేసింది..!
Published on Sep 15, 2016 3:19 pm IST

Pooja-Hegde
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో ‘డీజే- దువ్వాడ జగన్నాథం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసుకొని వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా అనౌన్స్ అయినరోజునుంచే అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లే వినిపించినా, చివరగా, దర్శక నిర్మాతలు పూజా హెగ్దేని హీరోయిన్‌గా ఖరారు చేశారు.

‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’ సినిమాలతో మెప్పించిన పూజా హెగ్దే, బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమా ‘మోహెంజోదారో’ అవకాశం సొంతం చేసుకొని కొద్దినెలల క్రితం అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలై పూజా హెగ్దేకి నిరాశనే మిగిల్చింది. ఇదే సమయంలో ఆమెకు అల్లు అర్జున్ సినిమాలో అవకాశం దక్కడం విశేషంగా చెప్పుకోవాలి. హరీష్ శంకర్ గత చిత్రాల స్టైల్లోనే యాక్షన్ కామెడీగా తెరకెక్కనున్న ‘డీజే’కు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

 
Like us on Facebook