పూజా హెగ్డే బయటపడింది

Published on May 5, 2021 9:30 pm IST

కరోనా సెకండ్ వేవ్ దేశం మొత్తం విజృంభిస్తోంది. రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. సినీ తారలు సైతం కరోనా బారినపడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ అనంతరం దాదాపు షూటింగ్స్ అన్నీ మొదలయ్యాయి. దీంతో వైరస్ వేగంగా విస్తరించింది. పలువురు హీరో హీరోయిన్లు, దర్శకులు వైరస్ బారినపడ్డారు. వారిలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడ ఉంది. ‘రాధేశ్యామ్’ షూటింగ్లో ఉండగా ఆమెకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.

అప్పటి నుండి హోమ్ ఐసొలేషన్లోనే ఉన్న ఆమె మెల్లగా కోలుకుంది. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన ‘పూజా పూర్తిగా కోలుకున్నాను, కరోనాను తన్నేశాను. మీ అందరి విసెష్ ఏదో మ్యాజిక్ చేశాయి’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. పూజకు పూర్తిగా కోలుకోవడంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇకపోతే పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ‘రాధేశ్యామ్, ఆచార్య’లతో పాటు విజయ్ సినిమా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :