మెగా హీరోతో ఐటెమ్ సాంగ్ కి రెడీ అయిన పూజా హెగ్డే
Published on Oct 4, 2017 2:12 pm IST


సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రంగస్థలం 1985 సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ కోసం యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఆ ఐటెం సాంగ్ లో చేసేందుకు మంగుళూరు బ్యూటీ పూజా హెగ్డే ని దర్శక నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే డీజే సినిమాతో పూజా హెగ్డే మెగా హీరో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం బెల్లంకొండతో కొత్త సినిమా కోసం డ్యూయెట్లు పాడుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు, ఆమె నుంచి కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది చిత్ర యూనిట్ చెబితే కాని తెలియదు.

 
Like us on Facebook