లేటెస్ట్…”ఆర్ఆర్ఆర్” రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

లేటెస్ట్…”ఆర్ఆర్ఆర్” రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

Published on May 6, 2024 8:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం (RRR). ఈ చిత్రం మార్చి 25, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ చిత్రం రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మే 10, 2024 న తెలుగు మరియు హిందీ భాషలలో 2డి మరియు 3డి ఫార్మాట్ లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం లో అధ్బుతమైన పెర్ఫార్మెన్స్ లతో పాటుగా, గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్ అలరిస్తాయి. ఒరిజనల్ స్కోర్ కు గాను ఆస్కార్ అవార్డు ను అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ లు కీలక పాత్రల్లో నటించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు