పూనం పాండే ప్రధాన పాత్రలో ‘మాలిని & కో’.

Malini-&-Co
‘యమలీల’, ‘వినోదం’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన మనీషా ఫిల్మ్స్ పతాకంపై కిషోర్ రాఠీ సమర్పణలో మహేష్ రాఠీ నిర్మిస్తున్న తాజా సినిమా ‘మాలిని & కో’. ప్రముఖ వివాదాస్పద, శృంగార తార పూనం పాండే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సామ్రాట్, మిలన్ రాఠీ, కావ్య సింగ్, సాంబ, రవి కాలే ఇతర పాత్రలలో నటిస్తున్నారు. వీరు.కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

యమలీల’ సినిమాలో బాల నటుడిగా నటించిన మిలన్ రాఠీ ‘మాలిని & కో’లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫైట్స్, డాన్స్, యాక్టింగ్ లలో శిక్షణ తీసుకున్నాడు. స్టార్ సినిమాలో ఉండే హంగులు అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత కిషోర్ రాఠీ ఈ సినిమాతో నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘యమలీల’ సినిమాను నిర్మించింది ఈయనే.

పూనం పాండే మాట్లాడుతూ.. ‘తేరా నషా తర్వాత ఏడాది పాటు విరామం తీసుకుని నటిస్తున్న సినిమా ఇది. తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా స్క్రిప్ట్ నచ్చక అంగీకరించలేదు. వీరు.కె చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

దర్శకుడు వీరు.కె మాట్లాడుతూ.. తీవ్రవాదం నేపధ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ప్రేమకథ ఇది. రెండు పాటల మినహా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. పాటలను డిసెంబర్ లో థాయిలాండ్ లో చిత్రీకరిస్తాం. వచ్చే నెలలో నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసి, జనవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.