సూర్య సినిమాలో స్పెషల్ రోల్ లో అవును హీరోయిన్ !

Published on Feb 24, 2019 9:46 am IST


తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘కాప్పాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్నఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో అవును ఫేమ్ పూర్ణ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆమె పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ అయ్యింది. కాగా సూర్య ఈ చిత్రంలో ఎన్ ఎస్ జి కమాండర్ గా కనిపించనున్నాడు.

మోహన్ లాల్, బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతంఅందిస్తున్న ఈ చిత్రం ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :