థియేటర్లలోనే “సుందరి”.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jul 28, 2021 12:00 am IST

హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సుందరి’. ‘ది ఆల్టిమేట్ డెసిష‌న్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ’ అనేది ట్యాగ్ లైన్. నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న దర్శకత్వంలో, రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుద‌ల‌కి సిద్ద‌మయ్యింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ ఒక విలేజ్ ఇన్నోసెంట్ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఇందులోని ప్రధానంశం అని, ప్రస్తుత సమాజంలో చాలా మంది అమ్మాయిల జీవితంలో జరుగుతున్న కథ అని, ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సురేష్ బొబ్బ‌లి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :