‘జిల్’ కి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్.!

‘జిల్’ కి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్.!

Published on Mar 26, 2015 1:25 PM IST

Jil
‘సాహసం’, ‘లౌక్యం’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మాచో హీరో గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కోసం మనం ముందుకు తీసుకురానున్న సినిమా ‘జిల్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్ టీజర్స్ అందరినీ తెగ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా గోపీచంద్ ని ప్రెజెంట్ చేసిన విధానం, రాశి ఖన్నా గ్లామర్ కూడా ప్రేక్సహ్కులను మరింత అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు.

రిలీజ్ కి ముందే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద చాలా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ డేరింగ్ అండ్ డాషింగ్ ఫైర్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఒక ఫైర్ ఆఫీసర్ అన్యాయం మీద పోరాటం చేస్తే ఎలా ఉంటుందనేది డైరెక్టర్ ఈ సినిమాలో చూపించాడు. ఈ పాయింట్ ఆన్ స్క్రీన్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అని ఈ చిత్ర మేకర్స్ అంటున్నారు.

‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు