‘ఒక్క క్షణం’ కి పెరుగుతున్న పాజిటివ్ టాక్ !

29th, December 2017 - 04:25:14 PM

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ‘ఒక్క క్షణం’ నిన్ననే విడుదలైన సంగతి తెలిసిందే. ముందు నుండి పాజిటివ్ వైబ్స్ ను కలిగి ఉన్న ఈ చిత్రం మొదటిరోజే పాజిటివ్ బజ్ ను తెచ్చుకుంది. దీంతో అన్ని ఏరియాల్లోను రెండవ రోజు రన్ ఇంకాస్త మెరుగుపడినట్లు సమాచారం. అలాగే భిన్నమైన సినిమాల్ని ఆదరించే ఓవర్సీస్లో సైతమ్ సినిమాకు చెప్పుకోదగిన ఓపెనింగ్స్ దక్కాయి.

ఇక రాబోయే రోజులు వీకెండ్ కావడం, పెరుగుతున్న పాజిటివ్ మౌత్ టాక్ కలిసి వసూళ్లు ఇంకాస్త మెరుగుపడేలా చేసే అవకాశముంది. ఇప్పటికి వరకు తెలుగులో రాని ప్యార్లల్ లైఫ్స్ అనే కాన్సెప్ట్ ను దర్శకుడు విఐ ఆనంద్ డీల్ చేసిన విధానం ప్రేక్షల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందులో శిరీష్ కు జోడీగా సురభి నటించగా సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు.