సన్నీ విడుదల చేసిన బాయ్స్ టీజర్… యూత్ ను ఆకట్టుకుంటోంది గా!

Published on Jul 18, 2021 6:42 pm IST

టాలీవుడ్ లో కొత్త సినిమాల జోరు ఊపందుకుంది. శ్రీ పిక్చర్స్ పతాకంపై గీతానంద, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం బాయ్స్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇందులోని రాజా హే రాజా అనే పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ పాటను శ్రీమణి రచించగా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. అయితే ఈ చిత్రానికి సంగీతం స్మరన్ అందిస్తున్నారు. అయితే మిత్ర శర్మ సినిమాలో నటిస్తూనే చిత్ర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

అయితే జూలై 16 న ఏ చిత్రం టీజర్ ను సెన్సేషనల్ హీరోయిన్ సన్నీ లియోన్ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయడం జరిగింది. అయితే సన్నీ లియోన్ చేతుల మీదుగా విడుదల అయిన ఈ టీజర్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

సంబంధిత సమాచారం :