భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ప్రస్తుతం దుబాయ్ లోని అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ సారథ్యంలో హెవీ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ ఖర్చుతో జరుగుతున్న ఈ షెడ్యూల్ కు దుబాయ్ లోని టుఫోర్24 అనే ప్రొడక్షన్ సర్వీస్ కంపెనీ అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది.
ఈ ప్రొడక్షన్ సర్వీస్ కంపెనీ యొక్క పనితీరు పట్ల ప్రభాస్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. లోకల్ మీడియాతో మాట్లాడిన ఆయన నా స్నేహితులు, పరిశ్రమలోని చాలా మంది చిత్రీకరణకు అబుదాబి చాలా మంచి చోటని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఉంది ఇక్కడ. టుఫోర్24, లోకల్ క్రూ, అభిమానులు, ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న సహకారం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది అన్నారు.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా ఇందులో బాలీవుడ్ స్టార్ నటి శ్రద్దా కపూర్ కథానాయకిగాను, నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగాను నటిస్తున్నారు.


