ట్రెండింగ్ : మూడు ప్రాజక్ట్స్ తో సూపర్ బిజీగా ప్రభాస్

ట్రెండింగ్ : మూడు ప్రాజక్ట్స్ తో సూపర్ బిజీగా ప్రభాస్

Published on Nov 9, 2022 3:01 AM IST

తొలిసారిగా హీరోగా ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన ప్రభాస్, ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక అక్కడి నుండి ప్రతి సినిమాతో కూడా ఆడియన్స్, ఫ్యాన్స్ ని అలరిస్తూ ఎన్నో సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. ఇక దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ రెండు సినిమాలతో ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ తరువాత కూడా పలు సక్సెస్ లు సొంతం చేసుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం దానికి సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ వేగంగా జరుగుతోంది.

మరోవైపు ప్రశాంత్ నీల్ తో ఆయన చేస్తున్న సలార్ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా నాగ అశ్విన్ తో చేస్తోన్న ప్రాజక్ట్ కె కూడా వరుస షెడ్యూల్స్ జరుపుకుంటోంది. అలానే వీటితో పాటు ఇటీవల యువ దర్శకుడు మారుతీ తో లేటెస్ట్ గా ఒక మూవీ స్టార్ట్ చేసిన ప్రభాస్, మధ్యలో ఖాళీ దొరికినపుడు దాని షూట్ కూడా కానిచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి యువ హీరోల్లో ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల వరుస షెడ్యూల్స్ తో బిజీ బిజీగా కొనసాగుతుండడం ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకింత ట్రెండింగ్ గా మారింది. మరి ఈ భారీ సినిమాలు వరుసగా రేపు రిలీజ్ తరువాత ప్రభాస్ కి ఎంత మేర సక్సెస్ ని అందిస్తాయి చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు