ప్రభాస్ దర్శకుడు స్పీడ్ పెంచాల్సిందేనా.?

Published on Sep 21, 2020 12:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. అయితే ప్రభాస్ ఇప్పుడు టేకప్ చేసిన మరో రెండు ప్రాజెక్టుల కన్నా ముందు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ లేకపోయినప్పటికీ మంచి హైప్ ఉంది. కానీ మొదటిగా రేస్ లో ఈ చిత్రమే ముందు ఉన్నప్పటికీ దీనికంటే ఆ రెండు సినిమాలకే భారీ హైప్ నెలకొంది.

దీనితో రాధే శ్యామ్ పై అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ వాటితో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. ఇక అంతా మాత్రం దర్శకుని చేతిలోనే ఉందని చెప్పాలి. ఇంకా ఎలాగో ప్రభాస్ పుట్టినరోజు వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఏమన్నా ప్లాన్ చేస్తే ఈ చిత్రం కూడా విడుదల సమయానికి ఖచ్చితంగా టేకాఫ్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. ఈ సినిమా విషయంలో హైప్ అండ్ విడుదల సమయంలో వసూళ్లు ఎలా ఉండాలి అన్నది మాత్రం దర్శకుడు రాధా కృష్ణ చేతుల్లోనే ఉంది.

సంబంధిత సమాచారం :

More