సామాజిక సేవకు పిలుపునిచ్చిన ప్రభాస్ !
Published on Sep 29, 2017 8:42 am IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పలువురు సినీ సెలబ్రిటీలను కార్యక్రమంలో భాగమవ్వాల్సిందిగా కోరి, ప్రత్యేకంగా వారికి లేఖలను కూడా పంపిన సంగతి తెలిసిందే. అలా లేఖలందుకున్న వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. ప్రభాస్ కూడా మోదీ పిలుపుకు స్పందించారు.

తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ‘దేశం పరిశుభ్రంగా ఉండాలని తపించిన మహాత్మాగాంధీగారి జయంతి రోజున దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. దేశాన్ని శుభ్రంగా ఉంచడం నా భాద్యత మాత్రమే కాదు అలవాటు కూడా. నాలాగే ఇంకెవరైనా అనుకుంటే స్వచ్ఛమైన ఇన్సియా కోసం సహకారాన్ని అందిస్తూనే ఉండండి’ అంటూ అభిమానులను, ప్రజలను కోరారు.

 
Like us on Facebook