ప్రభాస్20 కు కూడా “సాహో”లాగే చెయ్యాలట.!

Published on Jul 12, 2019 3:30 pm IST

టాలీవుడ్ లో తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులు ఎదురు చూసినంతగా మరే ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూసి ఉండరు అని చెప్పాలి.బాహుబలి కోసం ఐదేళ్లు ఆ తర్వాత సాహో కోసం మరో రెండేళ్లు మొత్తం ఏడేళ్లు కళ్ళు కాయలు కాచేలా వీరు ఎదురు చూసారు.ఇదిలా ఉండగా సాహో ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.అప్డేట్స్ కూడా చిత్ర యూనిట్ వారు కూడా ప్రమోషన్స్ జోరు పెంచేశారు.ఇదిలా ఉండగా ప్రభాస్ అభిమానులు మాత్రం “సాహో”కు ఏ విధంగా చేసారో ఆ తర్వాత ప్రభాస్ నటిచబోయే 20వ సినిమాకు కూడా అలాగే చెయ్యాలి అని యూవీ మేకర్స్ ను ఇప్పటి నుంచే అడిగేస్తున్నారు.

ఇంతకీ వీరు ఇంతలా అడుగుతున్న కోరిక ఏమిటంటే గతంలో బాహుబలి2 విడుదల చేసినపుడు సాహో మొట్టమొదటి టీజర్ ను అన్ని భాషల్లో కట్ చేసి అటాచ్ చేసి విడుదల చేసారు.అది చూసాక డార్లింగ్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.కానీ మళ్ళీ అప్పటి నుంచి ఆఫీసియల్ అప్డేట్ కోసం వీరికి తెలుసుకోవడానికి ప్రభాస్ పుట్టిన రోజు వరకు ఆగాల్సి వచ్చింది.దీనితో ఇప్పుడు విడుదల కాబోతున్న సాహో చిత్రానికి కూడా ప్రభాస్ నటించనున్న 20వ సినిమాకు సంబంధించి ఏదొక చిన్న టీజర్ అతికించి విడుదల చేయమని సోషల్ మీడియాలో అడుగుతున్నారు.ప్రభాస్20వ చిత్రాన్ని “జిల్” ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అందులో డార్లింగ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనున్నారు.ఈ చిత్రం 1940వ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కనుంది అని మరో టాక్ వినిపిస్తుంది.మరి వీరు ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More