అక్టోబర్ సెకెండ్ వీక్ నుండి ప్రభాస్.. !

Published on Sep 21, 2020 8:18 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేయడానికి ప్రభాస్ డేట్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ప్రభాస్ నవంబర్ నుండి షూట్ చేద్దామనుకున్నారు. అయితే అనుకున్న దాని కంటే ముందుగా ఇంత త్వరగా షూట్ చేయడానికి కారణం, ‘రాధే శ్యామ్’ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి ఓ భారీ హాస్పిటల్ సెట్‌ వేశారట.

సెట్ కావడంతో అది ఐదు నెలలకు మించి ఎక్కువ కాలం ఉండదని అక్కడ సాధ్యమైనంత త్వరగా షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ప్రభాస్ తో పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై కూడా కీలక సన్నివేశాల షూట్ జరగనుంది. ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్‌ లోనే క్లైమాక్స్ లో ప్రభాస్ పై వచ్చే కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని.. ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More