సమ్మర్లో బిజీ బిజీ కానున్న ప్రభాస్

సమ్మర్లో బిజీ బిజీ కానున్న ప్రభాస్

Published on Mar 18, 2015 8:31 AM IST

Baahubali
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సమ్మర్లో బిజీ బిజీగా ఉండడమే కాకుండా, తన కెరీర్లో బెస్ట్ సమ్మర్ ని ఎంజాయ్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. ఈ ఆరడుగుల ఆజానుబాహుడు టాలీవుడ్ భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’తో సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి బాహుబలిని పర్ఫెక్ట్ గా రెడీ చేస్తున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రభాస్ తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ మొత్తం ఫినిష్ చెయ్యడంతో ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవుతున్నాడు. మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న ప్రమోషన్స్ లో చాలా ఫ్రెష్ గా కనపడడమే కాకుండా, ఆ ప్రమోషన్స్ కోసం కూడా ఎంతో ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ టైటిల్ రోల్ అయిన బాహుబలి పాత్రలో కనిపించనున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ దశలో ఉన్న ఈ పీరియాడిక్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ అవుతుందని పలువురు అంటున్నారు. ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు