సాహో తరువాత వస్తున్న ‘జాన్’ బడ్జెట్ ఎంతంటే..?

Published on Dec 7, 2019 12:43 pm IST

ఈ మధ్య కాలంలో సాహో సినిమాకి వచ్చినంత హైప్ మరే చిత్రానికి వచ్చివుండదు. దేశవ్యాప్తంగా సాహో చిత్రంపై చర్చనడిచింది. బాహుబలి లాంటి అల్ ఇండియా హిట్ మూవీ తరువాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. ఐతే సాహో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. హిందీలో హిట్ గా నిలిచిన సాహో, ప్రభాస్ మదర్ ఇండస్ట్రీ తెలుగులో అనుహ్యంగా పరాజయం పాలైంది. తమిళంలో కూడా సాహో పరాజయం చవిచూసింది. వసూళ్ల పరంగా రికార్డ్స్ నమోదు చేసినప్పటికీ సాహో ని లాభాల పట్టించడానికి అవి సరిపోలేదు. ఐతే నాలుగు వందలకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో సాహో 2019 హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది.

ప్రస్తుతం ప్రభాస్ జాన్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ చిత్రీకరణ 30-40 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. ఈమద్యనే హీరోయిన్ పూజా హెగ్డే చిత్ర షూట్ లో జాయిన్ ఐయ్యారు. కాగా జాన్ మూవీ బడ్జెట్ కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న నేపథ్యంలో సాహో అంత కాకపోయినా జాన్ కొరకు 150 నుండి 180కోట్ల వరకు బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో ఈ మాత్రం బడ్జెట్ రికవర్ చేయడం అంత కష్టమైన పనేమీ కాదని నిర్మాతలు భావిస్తున్నారట. సాహో నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారే జాన్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More