‘ఐపీఎల్ 2024’ లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ యాడ్ ప్రమోషన్

‘ఐపీఎల్ 2024’ లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ యాడ్ ప్రమోషన్

Published on May 1, 2024 12:10 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ఇక ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

వైజయంతి మూవీస్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కల్కి మూవీలో అమితాబ్ పోషిస్తున్న అశ్వద్ధామ పాత్ర గ్లింప్స్ ని ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా రిలీజ్ చేసారు. ఇక తాజాగా కల్కి లో ప్రభాస్ సూపర్ హీరో లుక్ తో ఐపీఎల్ గురించి మాట్లాడుతున్న ప్రోమోని తమ ప్రమోషన్స్ లో భాగంగా చిన్న గ్లింప్స్ యాడ్ రిలీజ్ చేసింది కల్కి 2898 ఏడి టీమ్.

ఐపీఎల్ ఒక యుద్ధం లాంటిదని, మే 3న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ మెగా మ్యాచ్ కోసం సిద్ధంగా ఉండాలని ప్రభాస్ కోరడం ఆ యాడ్ లో చూడవచ్చు. ఇక ఈ యాడ్ ద్వారా ఐపీఎల్ 2024 మరియు కల్కి 2898 ఏడి రెండింటిని ప్రభాస్ ప్రమోట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ యాడ్ తో కల్కి పై ఆడియన్స్ లో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా కల్కి 2898 ఏడి మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జూన్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు