“రాధే శ్యామ్” నుంచి ప్రభాస్ లుక్స్ తో నెక్స్ట్ లెవెల్ ట్రీట్.!

Published on Dec 14, 2021 6:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ ఎంతో కేర్ గా చేసిన ఈ భారీ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఒక్కో కీలక అప్డేట్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలా ఈరోజు సినిమా నుంచి ఇంకో ఇంట్రెస్టింగ్ సాంగ్ “సంచారి” ని రిలీజ్ చేశారు.

మరి ఇది కూడా చూసాక లాస్ట్ టైం ప్రభాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సాహో కి వచ్చిన కామెంట్స్ అందరు వెనక్కి తీసుకోవడం గ్యారెంటీ అని చెప్పాలి. ఒక్కో సాంగ్ కి కూడా ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఫ్రెష్ లుక్స్ లో కనిపిస్తూ స్టన్ చేస్తున్నాడు. అలాగే ఈ సంచారి సాంగ్ లో అయితే ప్రభాస్ నుంచి గతపు ఎనర్జీ కూడా కనిపిస్తుంది.

ఇవన్నీ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్న మూవీ లవర్స్ కి కానీ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు సినిమాకి వర్క్ చేసారు. అలాగే ఈ చిత్రాన్ని యూవీ మేకర్స్ వచ్చే జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :