లేటెస్ట్ : టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ ఆన్లైన్ వార్

Published on Jan 28, 2023 8:45 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద స్టార్ హీరోలుగా అత్యద్భుతమైన క్రేజ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల యొక్క క్రేజ్ తో దిగ్విజయంగా దూసుకెళ్తున్న వారిలో ప్రభాస్, మహేష్ బాబు ఇద్దరూ కూడా టాప్ స్థానంలో నిలుస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అటు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు గారు, ఇటు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గార్ల మధ్య మొదటి నుండి ఎంతో గొప్ప స్నేహానుబంధం ఉండేది. ఇక ప్రస్తుతం దానిని మహేష్, ప్రభాస్ ఇద్దరూ కూడా మరింతగా కొనసాగిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి పలు వేదికలు, ఈవెంట్స్ లో సందడి చేశారు.

అయితే విషయం ఏమిటంటే, నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఒకింత కోల్డ్ వార్ జరుగుతోంది. అసలు కారణం ఏమిటనేది తెలియనప్పటికీ పలువురు ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఒకరి హీరోల పై మరొకరు నెగటివ్ స్పేస్ లు పెట్టడంతో పాటు పలు నెగటివ్ ట్వీట్స్ తో ట్విట్టర్ మొత్తం హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఇందులో భాగంగా #NeverMessWithMBFans అనే హ్యాష్ ట్యాగ్ మధ్యాహ్నం నుండి టాప్ లో ట్రెండింగ్ లో ఉండడంతో ఈ ఇద్దరు హీరోల కోల్డ్ వార్ ఘటన టాలీవుడ్ లో చర్చనీయాంశం గా మారింది.

నిజానికి ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మన సినిమాల యొక్క హద్దులు హాలీవుడ్ స్థాయికి పెరిగాయని, అలానే హీరోలు అందరూ కూడా ఎంతో చక్కగా కలిసి మెలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మరింత ఆరోగ్యకరమైన వాతావరణానికి బాటలు వేస్తుంటే అక్కడక్కడా కొందరు అభిమానులు మాత్రం వ్యక్తిగత విద్వేషాలతో ఇతర హీరోలపై ఈ విధంగా నెగటివ్ గా పోస్టులు చేస్తుండడం వారి వారి హీరోలకు ఇబ్బంది కలిగించడంతో పాటు ఇటు టాలీవుడ్ పరిశ్రమకి కూడా మాయని మచ్చగా మారుతుందని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. అందువలన దయచేసి ఇక పై ఇటువంటివి చేయడకుండా సాధ్యమైనంత వరకు హీరోల మాదిరిగా, వారి అభిమానులు కూడా అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉంటే ఎంతో బాగుంటుందని వారు కోరుతున్నారు.

సంబంధిత సమాచారం :