సంక్రాంతి 2024 కి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్!

Published on Mar 26, 2023 11:00 pm IST

సినిమా నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి సంక్రాంతి ఎప్పుడూ ఫేవరెట్ సీజన్. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఈ ఏడాది సంక్రాంతి 2024 స్లాట్‌ను ముందుగా రిజర్వ్ చేసుకున్న టీమ్ ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 జనవరి 12న పాన్ వరల్డ్ మూవీ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

కొద్దిసేపటి క్రితం, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా SSMB28 తో సంక్రాంతి కి రిలీజ్ ఉంటుంది అని ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ లుక్ లో ఉన్న పోస్టర్ తో పాటు జనవరి 13, 2024 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన RC15 తో రామ్ చరణ్ కూడా సంక్రాంతి 2024 సీజన్‌కు వస్తాడనే ప్రచారం ఉంది. రేపు చరణ్ పుట్టినరోజు కావడంతో, రేపు విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్‌ను మనం ఆశించవచ్చు. ఆర్‌సి15కి బదులు శంకర్ ఇండియన్ 2 సంక్రాంతి పండగకి రిలీజ్ అవుతుందనే టాక్ కూడా ఉంది. అయితే, సమయం పెరుగుతున్న కొద్దీ కొన్ని సినిమాల విడుదల తేదీలలో అనేక మార్పులు ఉండవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం ప్రభాస్, మహేష్ సినిమాల అనౌన్స్ మెంట్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :